Markapuram: మార్కాపురంలో ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటన

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్, మేకల దాసు సందర్శించారు.

Update: 2026-06-12 10:45 GMT

Markapuram: మార్కాపురంలో ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటన

Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ కమిషన్ సభ్యుడు డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్, మేకల దాసు పర్యటించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి చేరుకున్న వారికి ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి , డీఎస్పీ నాగరాజు, తహసీల్దార్ చిరంజీవి ,తహసీల్దార్ కార్యాలయ అధికారులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్, మేకల దాసు మండలంలో ఎస్సీ వర్గాల సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ సమస్యలపై వినతులు సమర్పించేందుకు వచ్చిన పిటిషనర్లతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రతి పిటిషన్‌ను పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డిఎస్పి నాగరాజు తహసీల్దార్ చిరంజీవి ,కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News