Addanki: అద్దంకి సింగరకొండ వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై దాడి
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ దేవస్థానం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై కారు యజమాని దాడికి దిగాడు.
Addanki: అద్దంకి సింగరకొండ వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై దాడి
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎదుట వాహనాలు పార్కింగ్ స్థలం వద్ద దాడి జరిగింది.
ఆర్టీసీ బస్సు నరసరావుపేట నుంచి ఒంగోలు కి వస్తుండగా మార్గమధ్యం అద్దంకి మండలం సింగరకొండ దేవస్థానం వద్ద ఆర్టీసీ బస్సుకు కారు అడ్డం రావడంతో డ్రైవర్ హారన్ గట్టిగా కొట్టాడు అనే నేపథ్యంలో కారు ఓనర్ డ్రైవర్ పై బూతులు వర్షం కురిపిస్తూ దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు.
ఆర్టీసీ డిపోకు చెందిన అధికారి, బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.