Markapuram: మార్కాపురంలో ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2026’

Markapuram: మార్కాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2026’ వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-07-20 07:07 GMT

Markapuram: మార్కాపురంలో ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2026’

Markapuram: మార్కాపురం జిల్లా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత, కలిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.

ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన మొత్తం 134 మంది విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరుకానున్నారు. ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తోంది. ఆర్జేడి గుంటూరు బి .లింగేశ్వర రెడ్డి, డీఈవో సామా సుబ్బారావు, మరియు విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News