Markapuram: మార్కాపురంలో బాలికల పాఠశాల వద్ద ఎస్‌ఐ నిఘా
Markapuram: మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వద్ద టౌన్ ఎస్‌ఐ విశ్వనాథ రెడ్డి ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు.
Markapuram: మార్కాపురంలో బాలికల పాఠశాల వద్ద ఎస్‌ఐ నిఘా
Markapuram: విద్యార్థినుల భద్రతే ప్రధాన లక్ష్యంగా మార్కాపురం టౌన్ పోలీసులు పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు. సోమవారం మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వద్ద టౌన్ ఎస్‌ఐ విశ్వనాథ రెడ్డి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలల పరిసరాల్లో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ లేదా ఏ రూపంలోనైనా విద్యార్థినులను వేధించే ఆకతాయిలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థినులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని సూచించారు.
విద్యార్థుల రాకపోకల సమయంలో పాఠశాలల వద్ద ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని, వారి భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని ఎస్‌ఐ విశ్వనాథ రెడ్డి తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.