Markapuram: కావాలనే మూసివేస్తే ఊరుకునేది లేదు.. పెట్రోల్ బంకులకు కలెక్టర్ హెచ్చరిక

Markapuram: మార్కాపురంలో పెట్రోల్ బంకులపై కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మిక తనిఖీ. 'నో స్టాక్' బోర్డులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక.

Update: 2026-04-28 02:53 GMT

Markapuram: కావాలనే మూసివేస్తే ఊరుకునేది లేదు.. పెట్రోల్ బంకులకు కలెక్టర్ హెచ్చరిక

Markapuram: మార్కాపురం పట్టణం, మండలంలోని తదితర చోట్ల ఉన్న పెట్రోల్ బంకులను సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కాపురం పట్టణంలోని రెండు చోట్ల, అదేవిధంగా మండలంలోని చింతకుంట, పెద్దారవీడు మండలంలోని దేవరాజు గట్టు ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకులను తనిఖీ చేసి స్టాక్ వివరాలు ప్రజలకు అందుతున్న తీరును పరిశీలించారు. తగినంత స్టాకు ఉన్నా కూడా పెట్రోల్ బంకులు మూత వేస్తున్నారని ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు అన్నారు. సర్వరాలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులకు తగిన మోతాదులో పెట్రోల్ అందజేయాలని సూచించారు. ఎట్టీ స్థితిలో నో స్టాక్ బోర్డులు పెట్టొద్దని పెట్రోల్ బంకుల సిబ్బందికి అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజు, సీఐ అల్తాఫ్ హుస్సేన్,ఇతర సిబ్బంది ఉన్నారు.

Tags:    

Similar News