Markapuram: మార్కాపురంలో స్వర్ణాంధ్ర విజన్ 2047పై సమీక్ష

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టర్ స్వర్ణాంధ్ర విజన్ 2047పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Update: 2026-04-25 11:57 GMT

Markapuram: మార్కాపురంలో స్వర్ణాంధ్ర విజన్ 2047పై సమీక్ష

Markapuram: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యసాధన దిశగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర విజన్ పై మార్కాపురం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్దేశిత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని లక్ష్యసాధనకు ఆచరించాల్సిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వచ్చే నెలకు సంబంధించి నెలవారి టార్గెట్ ను ఈనెల 27వ తేది లోపు నిర్ణయించి తన వద్ద అప్రూవల్ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

అదేవిధంగా ప్రతి నెల 5వ తేదీ నాటికి ఆ నెల సాధించిన పురోగతిని ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. పేదరిక లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి, నీటి భద్రత, టెక్నాలజీ వ్యవసాయం, అంతర్జాతీయ లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థవనియోగం లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు కనిగిరి ఆర్డీవో శివరామిరెడ్డి, సిపిఓ స్వరూపా రాణి, మైక్రో ఇరిగేషన్ పీడీ జెనెమ్మ, ఐసిడిఎస్ ఇంచార్జ్ పీడీ పద్మావతి, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News