Markapuram: ఇల్లు దాటి ఎంతో దూరం.. క్షేమంగా దొరికిన మార్కాపురం చిన్నారులు!

Markapuram: మార్కాపురం నుండి తప్పిపోయి తమిళనాడులో లభ్యమైన ఇద్దరు చిన్నారులు.

Update: 2026-04-26 05:09 GMT

Markapuram: ఇల్లు దాటి ఎంతో దూరం.. క్షేమంగా దొరికిన మార్కాపురం చిన్నారులు!

Markapuram: మార్కాపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి రైలు ఎక్కి తమిళనాడులోని ఒక పట్టణానికి చేరుకున్న ఘటన కలకలం రేపింది. అక్కడి బాగాయం పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు కనిపించగా, పోలీసులు వారిని విచారించారు. తమది మార్కాపురం జిల్లా అని పిల్లలు చెప్పడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమై సమాచారం అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మార్కాపురం పట్టణ ఇంచార్జి ఎస్‌.ఐ అహరోన్ స్పందిస్తూ, పిల్లల ఫొటోలను పరిశీలించి వారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మార్కాపురం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఫొటోలు చూసి చిన్నారుల వివరాలు తెలిసినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా మార్కాపురం పట్టణ పోలీసులకు తెలియజేయాలని సూచించారు.చిన్నారులు సురక్షితంగా ఉన్నారని, వారిని కుటుంబ సభ్యులకు అప్పగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఇంచార్జ్ పట్టణ ఎస్‌.ఐ అహరోన్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News