Markapur: పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు.. మార్కాపురంలో కలెక్టర్ సమీక్ష!
Markapur: ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యమని కలెక్టర్ ఎం. విజయ సునీత పేర్కొన్నారు.
Markapur: పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు.. మార్కాపురంలో కలెక్టర్ సమీక్ష!
Markapur: ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులకు సూచించారు. శనివారం మార్కాపురం కలెక్టరేట్లో డిఐఈపీ సి పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ విండో డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సమయం వరకు వేచి ఉండకుండా త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. పి ఎం ఈ జి పి పథకం ద్వారా పరిశ్రమలు నెలకొల్పడానికి దరఖాస్తు చేసిన వ్యక్తులకు వాటిని త్వరితగతిన పంపించాలన్నారు. మార్కాపురం జిల్లాలో రిలయన్స్ పరిశ్రమల వారు ఏర్పాటు చేస్తున్న సిబిజి ప్రాజెక్టులు, ఏపీ ఎన్జీఈఎల్, హరిత అమృత్ ఏర్పాటు చేసిన సోలార్ పవర్ పురోగతి, ఎం ఓ యు లు చేసుకున్న పరిశ్రమల పురోగతిపై అధికారులతో చర్చించారు. జిల్లాలో పరిశ్రమలకు చెందిన వివిధ రాయితీలకు సంబంధించి 8 క్లయిమ్ లకు రూ. 4.34 కోట్ల ను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి బి. శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్ మోహన్, నాబార్డ్ డీడీఎం రవికుమార్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.