Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం కౌలాస్ వాగులో మునిగి యువకుడు మృతి!

Kamareddy: చిన్న తక్కడ్ పల్లి వద్ద ఆషాఢ మాస పూజల కోసం వచ్చి కౌలాస్ వాగులో స్నానానికి దిగిన మిట్టపల్లి లక్ష్మణ్ (25) నీటిలో మునిగి మృతి చెందాడు.

Update: 2026-08-10 13:57 GMT

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం కౌలాస్ వాగులో మునిగి యువకుడు మృతి!

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణానికి చెందిన ఓ యువకుడు వాగులో మునిగి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. బిచ్కుంద పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం, బిచ్కుంద పట్టణానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ (25) ప్రస్తుతం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం లో నివాసం ఉంటున్నాడు.

ఆషాడ మసాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం చిన్న తక్కడ్ పల్లి గ్రామ శివారులో ఉన్న కౌలస్ వాగు వద్దకు మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులు వంట కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా లక్ష్మణ్ స్నానం చేయడానికి వాగులోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదావశత్తు నీటిలో మునిగి పోయాడు.లక్ష్మణ్ కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.

ఎంతకీ లక్ష్మణ్ ఆచూకీ లభించకపోవడం తో పెద్ద తక్కడ్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సహాయంతో వాగులో గాలింపు చేపట్టాగా లక్ష్మణ్ మృత దేహం లభ్యమైంది. అనంతరం మృతదేహన్ని బయటకు తీసి బాన్స్ వాడ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సాయవ్వ ( సావిత్రి ) పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిచ్కుంద ఎస్సై గుండెల రాజు తెలిపారు.

Tags:    

Similar News