Banswada: తండాల్లో కోలాహలంగా 'తీజ్' వేడుకలు – ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం!

Banswada: బాన్సువాడ మండలంలోని పోచారం తండా, రాంపూర్ తండాల్లో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-08-09 14:30 GMT

Banswada: తండాల్లో కోలాహలంగా 'తీజ్' వేడుకలు – ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం!

బాన్సువాడ: బాన్సువాడ మండలం లోని పోచారం తండా, రాంపూర్ తండాలో ఘనంగా నిర్వహించిన "తీజ్" పండుగ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బంజారా సోదర సోదరీమణులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపాటు.అనంతరం పోచారం వారి ఆనందోత్సాహాల్లో భాగస్వాములయ్యారు. తీజ్ పండుగలో భాగంగా సంప్రదాయ పద్ధతిలో పెంచిన గోదుమ గడ్డి బుట్టలను (తీజ్) ఎత్తుకుని, బంజారా సోదరీమణులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News