Jukkal: జలకళ సంతరించుకున్న జుక్కల్ కౌలస్ నాలా ప్రాజెక్ట్

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ కౌలస్ నాలా ప్రాజెక్ట్‌లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. నిండుకుండలా మారిన జలాశయంతో ఆనందంలో రైతులు.

Update: 2026-08-08 12:19 GMT

Jukkal: జలకళ సంతరించుకున్న జుక్కల్ కౌలస్ నాలా ప్రాజెక్ట్

జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌ లాస్ నాలా ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కౌ లాస్ నాలా ప్రాజెక్ట్ లోకి కొత్త నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నిండుకుండాలా మారింది.

వరుసగా ఏడాతేరాపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరడం తో ప్రాజెక్ట్ కు జలకళ సంతరించుకుంది. దింతో ప్రాజెక్ట్ ఆయకట్టు కింది అన్నదాతలో ఆనందం వెళ్లువేరుస్తుంది.గత రెండు వారాలుగా ఏడాతేరాపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరద నీరు రావడం తో బిచ్కుంద, పెద్ద కొడప్ గల్, జుక్కల్ మండలాలకు వరప్రదాయాని ఐన కౌలస్ నాలా ప్రాజెక్ట్ నిండుకుండాలా మారింది.

ప్రాజెక్ట్ కు 985 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతుంది. జలాశయం నీటి మట్టం 458.00 మీటర్లు కాగా ప్రస్తుతం 457.05 మీటర్లు గా ఉంది. నీటి నిల్వ సామర్ధ్యం 1.237 టి ఎం సి లకు గాను 1.016 టి ఎం సి లు గా ఉంది.

ఎగువ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో కి వచ్చాక ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఏ క్షణనైన ప్రాజెక్ట్ ఆయకట్టు కింది గ్రామ ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రాజెక్ట్ నిండు కుండల మారడంతో ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ దిగువస్తాయి మూడు మండలాల్లోని సుమారు 9 వేల ఎకరాలకు సాగు నీరు అందనుండడంతో పంట సాగుకు డోకా లేదని అన్నదాతలు అభిప్రాయా పడుతున్నారు.

Tags:    

Similar News