Banswada: బాన్సువాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా ఎల్లమ్మ తల్లి బోనాలు

Banswada:బాన్సువాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ బాలరాజు బోనం ఎత్తి మొక్కులు చెల్లించారు.

Update: 2026-08-09 07:57 GMT

Banswada: బాన్సువాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా ఎల్లమ్మ తల్లి బోనాలు

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గౌడ సంఘం వారు ఎల్లమ్మ తల్లి బోనాలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ బోనాలు పాత బాన్సువాడ నుండి బయలు దేరి,పట్టణం లోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి,ఎల్లమ్మ తల్లి దేవాలయం వరకు కొనసాగాయి.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు లు పాల్గొని బోనం ఎత్తుకున్నారు.వర్షాలు సమృద్ధిగా కురిసి,పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నారు.వీరితో పాటు గౌడ సంఘం పెద్దలు ,వేణు గౌడ్,రాజా గౌడ్,సతీష్ గౌడ్,నరేష్ గౌడ్ లతో పాటు, కులస్తులు ,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News