PM Modi: షార్ట్‌కట్‌లతో ముప్పే.. జెన్‌జీ యువతకు ప్రధాని మోదీ కీలక సందేశం!

PM Modi: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణలో జెన్‌జీ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు. రీల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు.

Update: 2026-08-12 09:18 GMT

PM Modi: షార్ట్‌కట్‌లతో ముప్పే.. జెన్‌జీ యువతకు ప్రధాని మోదీ కీలక సందేశం!

PM Modi: వేగంగా గమ్యాలు చేరుకోవడానికి జీవితంలో షార్ట్‌కట్‌ల కోసం వెంపర్లాడితే తీవ్రంగా నష్టపోతారని ప్రధాని నరేంద్ర మోదీ జెన్‌జీ (Gen Z) యువతను హెచ్చరించారు. ప్రగతి మార్గంలో పయనించే క్రమంలో ప్రతి ఒక్కరూ అర్థవంతమైన, నిజాయితీ కలిగిన మార్గాలనే ఎంచుకోవాలని హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

త్వరగా వెళ్లేందుకు ఫుట్‌బ్రిడ్జ్‌లు ఉపయోగించకుండా ట్రాక్‌లు దాటేవారిని ఉదాహరిస్తూ.. రైల్వే బోర్డులపై ఉండే "A shortcut will cut you short" అనే సూక్తి జీవితానికి సరిగ్గా సరిపోతుందన్నారు. సోషల్ మీడియాలో మైండ్ సెట్‌ను ప్రభావితం చేసే రీల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.

కేవలం రీల్స్‌కే పరిమితం కాకుండా, సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయుల ఆత్మకథలను చదివి జీవిత పాఠాలు నేర్చుకోవాలని కోరారు. కాగా, ఇటీవల జెన్‌జీ యువతకు దగ్గరయ్యేలా ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియోలు, యువత వాడే ట్రెండీ భాషను ఉపయోగిస్తూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నారు.

Tags:    

Similar News