NEET PG 2026: అభ్యర్థులకు అలర్ట్: నీట్ పీజీ పరీక్ష సెంటర్లలో మార్పులు.. చెక్ చేసుకోండి!
NEET PG 2026: నీట్ పీజీ 2026 పరీక్ష సెంటర్ల సాంకేతిక సమస్యపై ఎన్‌బీఈఎంఎస్ స్పష్టత. దరఖాస్తుల్లో ఫొటో, సంతకం ఎడిట్ చేసుకోవడానికి ఆగస్టు 15 వరకు చివరి అవకాశం.
NEET PG 2026: అభ్యర్థులకు అలర్ట్: నీట్ పీజీ పరీక్ష సెంటర్లలో మార్పులు.. చెక్ చేసుకోండి!
NEET PG 2026: నీట్ పీజీ 2026 (NEET-PG 2026) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే పలువురు అభ్యర్థులకు సాంకేతిక సమస్యల కారణంగా తప్పుడు పరీక్ష సెంటర్ల వివరాలు వెళ్లినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) బుధవారం స్పష్టం చేసింది. ఈ పొరపాటును సరిదిద్ది, సరైన వివరాలతో కొత్తగా ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిళ్లు పంపినట్లు వెల్లడించింది.
అభ్యర్థులు పాత ఎస్‌ఎంఎస్‌లను నమ్మకుండా, తక్షణమే అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమకు కేటాయించిన సరికొత్త పరీక్ష కేంద్రాన్ని సరిచూసుకోవాలని బోర్డు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను నమ్మవద్దని సూచించింది. వైద్య విద్యా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 30న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. అప్లికేషన్లలో ఫొటో, సంతకం, బొటనవేలి ముద్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి సరిచేసుకోవడానికి ఆగస్టు 15 రాత్రి 11.55 గంటల వరకు ఎన్‌బీఈఎంఎస్ చివరి అవకాశం కల్పించింది.
అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి తమ ఫొటో, సంతకం ఆమోదం పొందాయో లేదో చెక్ చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా తప్పులు సరిదిద్దకపోతే దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను యాక్టివ్‌గా ఉంచుకోవాలని బోర్డు స్పష్టం చేసింది.