Prakash Raj: ప్రకాష్ రాజ్ వివాదంపై ఈసీ క్లారిటీ.. పాత ఇంట్లో లేకపోవడం వల్లే మార్పు!
Prakash Raj: బెంగళూరులో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై ఈసీ స్పష్టత.
Prakash Raj: ప్రకాష్ రాజ్ వివాదంపై ఈసీ క్లారిటీ.. పాత ఇంట్లో లేకపోవడం వల్లే మార్పు!
Prakash Raj: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర ఓటరు సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, బెంగళూరులోని తన ఓటు హక్కును కావాలనే తొలగించారంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలపై ఎన్నికల అధికారులు స్పష్టతనిచ్చారు. ప్రకాష్ రాజ్ ఓటును తొలగించలేదని, ఆయన పాత చిరునామాలో నివాసం ఉండటం లేనందుకే 'శాశ్వతంగా మారిన చిరునామా' కేటగిరీలోకి మార్చినట్లు బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ (BBMP) స్పష్టం చేసింది.
ప్రకాష్ రాజ్ ఓటరు ఐడీలో నమోదైన శాంతి నగర్ అపార్ట్‌మెంట్‌లో ఆయన గత నాలుగేళ్లుగా నివసించడం లేదని స్థానికుల విచారణలో బిఎల్ఓ (BLO) అధికారులు నిర్ధారించారు. అధికారులు ప్రకాష్ రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడు, తానే స్వయంగా సదరు అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి అదే ఏరియాలోని వేరే ప్రాంతానికి మారినట్లు అంగీకరించారని అడిషనల్ జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ వెల్లడించారు.
ప్రకాష్ రాజ్ ప్రస్తుతం నివసిస్తున్న కొత్త చిరునామా ఆధారాలతో 'ఫారమ్-6' (Form-6) దాఖలు చేసి తన ఓటు హక్కును సులభంగా పునరుద్ధరించుకోవచ్చని అధికారులు సూచించారు.
ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటరు ప్రక్షాళన కార్యక్రమంపై సరైన అవగాహన లేకుండా బాధ్యతాయుత స్థానంలో ఉండి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.