PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!
PM Kisan: పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్ల పాటు పొడిగింపు. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పథకం అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..
PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!
PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రతిష్టాత్మక 'పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి' (PM-Kisan) పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పొడిగింపునకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పీఎం-కిసాన్ పథకాన్ని రాబోయే ఐదేళ్ల పాటు విజయవంతంగా కొనసాగించేందుకు గాను రూ.3.15 లక్షల కోట్లు ఖర్చు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది.