Transgender: రూ. 6 లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటే... భార్య ప్లేస్‌లో ట్రాన్స్‌జెండర్

Transgender: పెళ్లయిన 25 రోజులకే తన భార్య స్త్రీ కాదని, ట్రాన్స్‌జెండర్ అని తెలిసి ఓ వరుడు షాజాపూర్ పోలీసులను ఆశ్రయించాడు.

Update: 2026-07-31 07:49 GMT

Transgender: రూ. 6 లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటే... భార్య ప్లేస్‌లో ట్రాన్స్‌జెండర్

Madhya Pradesh: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో వెలుగు చూసింది. ముచ్చటపడి మూడేళ్లు కూడా కాకముందే, ఏడడుగులు నడిచిన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన వరుడికి షాకింగ్ నిజం తెలిసింది. పెళ్లయిన 25 రోజులకే తన భార్య అసలు స్త్రీ కాదని, ట్రాన్స్‌జెండర్ అంటూ సదరు బాధితుడు ఏకంగా పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

షాజాపూర్‌కు చెందిన 32 ఏళ్ల కూరగాయల వ్యాపారికి రాజ్‌గఢ్ జిల్లా పచోర్‌కు చెందిన ఒక యువతితో సంబంధం కుదిరింది. వచ్చే ఏడాది పెళ్లి చేద్దామని వరుడి ఇంట్లో అనుకున్నప్పటికీ... వధువు తరఫు వారు తొందరపడటంతో గత జూన్ 29న ఒక హిందూ దేవాలయంలో అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి కోసం సుమారు రూ. 5 లక్షల ఖర్చుతో పాటు, రూ. 1 లక్ష నగదును కూడా కట్నంగా ఇచ్చారు.

తీరా పెళ్లయ్యాక అసలు కథ మొదలైంది. పెళ్లయిన తొలిరాత్రే పీరియడ్స్ వచ్చాయని చెప్పి శోభనానికి దూరంగా ఉంది. మరుసటి రోజు కడుపునొప్పి అంటూ శారీరకంగా కలవడానికి నిరాకరించింది. జూలై 2న పుట్టింటికి వెళ్లిపోయి, మళ్లీ 20 రోజుల తర్వాత అత్తగారింటికి చేరుకుంది.

జూలై 23న అత్తగారింటికి తిరిగి వచ్చిన తర్వాత వధువు ప్రవర్తన అందరిలోనూ అనుమానాలు రేకెత్తించింది. అయితే, ఆమె షేవింగ్ చేసుకోవడాన్ని గమనించిన వరుడి వదిన మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే అనుమానంతో కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా... వరుడు జూలై 24న భార్యను నిలదీశాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి తమను ఘోరంగా మోసం చేశారంటూ వధువు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మీ కుమార్తెను తీసుకెళ్లండి అని నిలదీశారు.

తమ మోసం బయటపడిందన్న కోపంతో పచోర్ నుంచి షాజాపూర్ వచ్చిన అత్తగారింటి బంధువులు... వ్యవహారాన్ని సర్దుమొగ్గు చేయాల్సింది పోయి ఎదురుదాడికి దిగారు. వరుడి కుటుంబాన్ని బూతులు తిడుతూ, దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు కొత్వాలి పోలీసులను ఆశ్రయించగా... జూలై 25న బాధితుడిపై దాడి చేసిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వింత ఘటనపై కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంతోష్ బాఘేలా స్పందిస్తూ... బాధితుడు ఆరోపిస్తున్నట్లుగా ఆ వ్యక్తి ట్రాన్స్‌జెండరా కాదా అనేది వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాతే అధికారికంగా నిర్ధారణ అవుతుంది. మెడికల్ రిపోర్టులో ఆరోపణలు నిజమని తేలితే నిందితులపై చీటింగ్ కేసులు నమోదు చేస్తాం అని స్పష్టం చేశారు. ఏది ఏమైనా రూ. 6 లక్షలు వదిలించుకుని, మోసపోయామని తెలుసుకున్న ఆ వరుడు ఇప్పుడు న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.

Tags:    

Similar News