Nalgonda: మైనర్‌ బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష!

నల్గొండ జిల్లా: మైనర్‌ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు షేక్‌ సయ్యద్‌ భాషకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ నల్గొండ జిల్లా పోక్సో న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2018లో వాడపల్లి ఠాణా పరిధి దామరచర్లలో ఈ ఘటన జరిగింది. న్యాయమూర్తి విశ్వనాథ్‌ కులకర్ణి దిలీప్‌రావు ఈ తీర్పు వెలువరించగా, దర్యాప్తు అధికారులను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అభినందించారు.

Tags: