Kanagal: ధర్వేశ్‌పురంలో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన మంత్రి!
Kanagal: నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశ్‌పురంలో నూతన మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
Kanagal: ధర్వేశ్‌పురంలో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన మంత్రి!
Kanagal: మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కనగల్ మండలం ధర్వేశ్‌పురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సంఘాలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.