Nalgonda: నల్లగొండలో కలకలం.. ఎన్టీఆర్ విగ్రహానికి అంటుకున్న మంటలు!

Nalgonda: నల్లగొండ ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి అంటుకున్న మంటలు. విగ్రహం పాక్షికంగా ధ్వంసం.

Update: 2026-06-06 04:51 GMT

Nalgonda: నల్లగొండలో కలకలం.. ఎన్టీఆర్ విగ్రహానికి అంటుకున్న మంటలు!

Nalgonda: నల్లగొండ పట్టణంలో శనివారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహం వద్ద ప్రమాదవశాత్తు అపశృతి చోటుచేసుకుంది. గుర్తుతెలియని కారణాలతో విగ్రహానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో విగ్రహం కొంతమేర కాలిపోయినట్లు స్థానికులు గుర్తించారు.

​పోలీసుల రంగప్రవేశం.. దర్యాప్తు ముమ్మరం

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది విగ్రహాన్ని శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News