Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ప్రత్యేక సమీక్ష
Nalgonda: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం (EVM) భద్రతా గోదామును జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ప్రత్యేక సమీక్ష
Nalgonda: జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) భద్రతా గోదామును జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు.
నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించే అంతర్గత పరిశీలనలో భాగంగా రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోదామును తెరిపించారు. అక్కడ భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వివరాలను, వాటి భద్రతా ప్రమాణాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.