Nakrekal: పేదింటి ఆడపిల్లలకు 'కల్యాణలక్ష్మి' కొండంత అండ వేముల వీరేశం
Nakrekal: పన్నాలగూడెంలో 16 మందికి 'కల్యాణలక్ష్మి' చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ పథకం కొండంత భరోసా అని వెల్లడి.
Nakrekal: పేదింటి ఆడపిల్లలకు 'కల్యాణలక్ష్మి' కొండంత అండ వేముల వీరేశం
నకిరేకల్: పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు 'కల్యాణలక్ష్మి' పథకం కొండంత ఆర్థిక భరోసాను ఇస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 16 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడపిల్లల వివాహ సమయంలో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.