Mellacheruvu: మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ నరసింహ తనిఖీలు

Mellacheruvu: మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సూర్యాపేట ఎస్పీ నరసింహ. శంభులింగేశ్వర జాతర ఏర్పాట్లపై సమీక్ష, వనమహోత్సవంలో 2 వేల మొక్కలు నాటే కార్యక్రమం.

Update: 2026-07-28 14:29 GMT

Mellacheruvu: మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ నరసింహ తనిఖీలు

మేళ్ళచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, త్వరలో జరగనున్న ఆలయ జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

​అనంతరం విద్యార్థులతో కలిసి వనమహోత్సవంలో భాగంగా రెండు వేల మొక్కలు నాటారు. ఈ ప్రాంతంలో మహిళలు, విద్యార్థుల భద్రత కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళు, వ్యాపార కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.​

ఇక ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో ఆరుతడి పంటలు సాగు చేయాలని, నకిలీ ఎరువులతో మోసపోవద్దని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించినా, నేరాలను ప్రోత్సహించినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ నరసింహ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News