Nalgonda: ఎన్నికల బరిలోకి ‘ఆధార్ పార్టీ’.. అధ్యక్షుడు కీలక ప్రకటన!
Nalgonda: ఆధార్ పార్టీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఈడ శేషగిరిరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని, మహిళలకు 40% సీట్లు ఇస్తామని ప్రకటించారు.
Nalgonda: ఎన్నికల బరిలోకి ‘ఆధార్ పార్టీ’.. అధ్యక్షుడు కీలక ప్రకటన!
నల్గొండ: రాబోయే స్థానిక సంస్థలు, పురపాలక, శాసనసభ ఎన్నికల్లో ఆధార్ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈడ శేషగిరిరావు స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రమైన గాంధీనగర్‌లోని యాదవ భవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ తమ పార్టీలో 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేసే సామర్థ్యం యువతలోనే ఉందన్న ఆయన, రాజకీయాల్లోకి రావడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.