Suryapet: ఐకేపీ కేంద్రంలో ఒక్కో ధాన్యం లారీపై రూ.30,000 మోసం!
Suryapet: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలులో భారీ అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
Suryapet: ఐకేపీ కేంద్రంలో ఒక్కో ధాన్యం లారీపై రూ.30,000 మోసం!
సూర్యాపేట: పిల్లలమర్రి ఐకేపీ(2) కేంద్రంలో రైతులను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ధాన్యం కొనుగోలులో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో లారీ ధాన్యంపై సుమారు రూ.30,000 వరకు మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా A గ్రేడ్ ధాన్యంలో సైతం ఒక్కో లారీకి 35 నుంచి 40 బస్తాలు తక్కువ చేసి చూపిస్తున్నారని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మమ్మల్ని ఇలా మోసం చేయొద్దు. కష్టపడి పండించిన ధాన్యానికి రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి” అంటూ రైతులు వేడుకుంటున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.