Suryapet: నూతనకల్‌లో పోలీసుల మెరుపు దాడి.. రంగంలోకి నార్కోటిక్ డాగ్ స్క్వాడ్!
Suryapet: సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు నూతనకల్ మండల కేంద్రంలో పోలీసులు నార్కోటిక్ డాగ్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Suryapet: నూతనకల్‌లో పోలీసుల మెరుపు దాడి.. రంగంలోకి నార్కోటిక్ డాగ్ స్క్వాడ్!
సూర్యాపేట: జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాలతో నూతనకల్ మండల కేంద్రంలో బుధవారం పోలీసులు నార్కోటిక్ డాగ్ సాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
మండల కేంద్రంలోని హోటల్స్, కిరాణా షాపులు, టీ స్టాల్స్, పాన్‌షాపులు, కూరగాయల దుకాణాలతో పాటు ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలను వాసన ద్వారా పసిగట్టి గుర్తించే సామర్థ్యం ఈ నార్కోటిక్ డాగ్‌కు ఉందని ఎస్సై వివరించారు.
యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చూడడమే ప్రధాన ఉద్దేశమని, ఎవరైనా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసు సిబ్బంది, నార్కోటిక్ డాగ్ నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు.