Suryapet: నిరుపేదలకు పక్కా ఇల్లే లక్ష్యం: ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి

Suryapet: అర్హులైన ప్రతి నిరుపేదకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

Update: 2026-05-21 12:23 GMT

Suryapet: నిరుపేదలకు పక్కా ఇల్లే లక్ష్యం: ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట: ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

పెన్ పహాడ్ మండలంలోని న్యూ బంజారాహిల్స్ తండా (ఎల్లప్ప కుంట తండ) గ్రామంలో లబ్ధిదారులు గుగులోతు చంద్రకళ, హనుమంతు దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించి ఒక్కరికీ పక్కా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి ఏటా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

“ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల మొహంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం” అని సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు పేదలను మోసం చేశారని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మాత్రమే పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, గ్రామ సర్పంచ్ ధారవత్ కవిత రవీందర్ నాయక్,జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News