Krrish 4: ‘క్రిష్ 4’ బడ్జెట్ రూమర్లపై గుట్టు విప్పిన రాకేశ్ రోషన్!
Krrish 4: బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘క్రిష్’ సిరీస్ నుండి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ మూవీ ‘క్రిష్ 4’.
Krrish 4: ‘క్రిష్ 4’ బడ్జెట్ రూమర్లపై గుట్టు విప్పిన రాకేశ్ రోషన్!
Krrish 4: బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘క్రిష్’ సిరీస్ నుండి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ మూవీ ‘క్రిష్ 4’. హృతిక్ రోషన్ హీరోగా వైఆర్ఎఫ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మాణంలో అనౌన్స్ అయిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్‌్ోపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. బడ్జెట్ విషయమై హృతిక్ రోషన్‌కు, నిర్మాత ఆదిత్య చోప్రాకు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే సినిమా ఆలస్యమవుతోందనే వార్తలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ వివాదాలపై హృతిక్ రోషన్ తండ్రి, స్టార్ మేకర్ రాకేశ్ రోషన్ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
రూ. 500 కోట్ల బడ్జెట్ డిమాండ్ అంతా అబద్ధం!
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాకేశ్ రోషన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ యశ్ రాజ్ ఫిలింస్ సంస్థను రూ. 500 కోట్ల బడ్జెట్ అడిగారనే వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. అదంతా కేవలం ‘నాన్‌సెన్స్’ (అబద్ధం) అని ఆయన కొట్టిపారేశారు.
"ఒక మంచి సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా భారీ స్థాయిలో తెరకెక్కించాలంటే సమయం పడుతుంది. నేను కూడా గతంలో క్రిష్ సిరీస్ సినిమాలకు చాలా సమయం తీసుకున్నాను. మా మధ్య ఎలాంటి బడ్జెట్ ఇష్యూస్ లేవు. ఆదిత్య చోప్రా, హృతిక్, నేను.. మేమంతా ఒక టీమ్‌లా కలిసి స్మూత్‌గా వర్క్ చేస్తున్నాము" అని రాకేశ్ రోషన్ స్పష్టం చేశారు.
హృతిక్ సొంత బ్యానర్ వల్లే లేట్.. డైరెక్టర్‌గా హృతిక్!
ఈ సినిమా ఆలస్యం కావడానికి అసలు కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు. హృతిక్ రోషన్ కొన్ని నెలల క్రితమే తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌ను లాంచ్ చేశారని, ఆ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్లే ‘క్రిష్ 4’ కాస్త ఆలస్యమైందని తెలిపారు.
ప్రస్తుతం ‘క్రిష్ 4’ స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని, అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో అంటే 2026 చివరి నాటికి ఈ సినిమాను షూటింగ్ ఫ్లోర్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
2018లోనే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్‌ను మొదట ‘అగ్నిపథ్’ ఫేమ్ కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే గత ఏడాది (2025) రాకేశ్ రోషన్ సంచలన ప్రకటన చేస్తూ.. ఈ చిత్రానికి హృతిక్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహిస్తారని స్పష్టం చేశారు.
2013లో వచ్చిన ‘క్రిష్ 3’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత, హృతిక్ రోషన్ తన సొంత దర్శకత్వంలో వైఆర్ఎఫ్ లాంటి భారీ నిర్మాణ సంస్థతో కలిసి రాబోతున్న ఈ క్రేజీ సూపర్ హీరో విజువల్ వండర్ కోసం ఇండియన్ సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.