Janhvi Kapoor: బోల్డ్ సీన్లు వద్దని జాన్వీ కపూర్ చెప్పిన బుచ్చిబాబు వినలేదు..వెలుగులోకి సంచలన విషయాలు
Janhvi Kapoor: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ స్కిన్ షోపై తీవ్ర వివాదం.
Janhvi Kapoor: బోల్డ్ సీన్లు వద్దని జాన్వీ కపూర్ చెప్పిన బుచ్చిబాబు వినలేదు..వెలుగులోకి సంచలన విషయాలు
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా రిలీజై మూడు రోజులు కాకముందే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే, ఒకవైపు కలెక్షన్ల పండగ నడుస్తుంటే.. మరోవైపు ఈ సినిమాను ఒక పెద్ద వివాదం చుట్టుముట్టింది. చిత్రంలో జాన్వీ కపూర్ చేసిన స్కిన్ షో పై నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. తాజాగా జాన్వీ కపూర్ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తీవ్ర దుమారం రేపుతోంది.
సినిమా షూటింగ్ సమయంలోనే కొన్ని బోల్డ్ సీన్స్, స్కిన్ షోపై జాన్వీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఇందుకు సంబంధించిన కొన్ని చాట్ స్క్రీన్ షాట్లు కూడా గతంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటికీ బలం చేకూరుస్తూ మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ సంచలన విషయాలను బయటపెట్టారు.
జాన్వీ కపూర్ కథ వినేప్పుడే తను ఎంతవరకు గ్లామర్‌గా నటించగలదో స్పష్టమైన గీత గీసుకుంది. బోల్డ్ సీన్లు చేయనని ముందే చెప్పింది. కానీ షూటింగ్ సమయంలో సినిమా డైరెక్టర్ ఆ గీత దాటారు. జాన్వీకి ఇష్టం లేకపోయినా.. తనకు నచ్చినట్లుగా సీన్లను డిజైన్ చేసి షూట్ చేశారు. సినిమా ఎడిటింగ్ సమయంలోనైనా ఆ సీన్లను తీసేస్తారని భావించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు, హైప్ పెంచుకోవడం కోసమే ఫైనల్ ఎడిట్‌లో ఆ స్కిన్ షో సీన్లను అలాగే ఉంచేశారు.
సావ్లీన్ కౌర్ చేసిన ఈ పోస్ట్‌తో 'పెద్ది' టీమ్ డిఫెన్స్‌లో పడినట్లయింది. ఒక స్టార్ హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అలా ఎలా స్క్రీన్ పై చూపిస్తారంటూ కొందరు నెటిజన్లు డైరెక్టర్‌పై మండిపడుతున్నారు. మరికొందరేమో బాక్సాఫీస్ నెంబర్ల కోసం మేకర్స్ ఇంతలా దిగజారాలా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఈ వివాదం సినిమా కలెక్షన్లపై ఏమైనా ప్రభావం చూపుతుందా? లేదా ఉల్టా సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంచలన ఆరోపణలపై 'పెద్ది' చిత్ర యూనిట్ లేదా డైరెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.