హనీ రోజ్ చేజార్చుకున్న మెగా ఆఫర్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Rachita Ram: మెగాస్టార్ చిరణ్జీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న అప్-కమింగ్ యాక్షన్ డ్రామా ‘Mega158’.

Update: 2026-06-07 07:23 GMT

హనీ రోజ్ చేజార్చుకున్న మెగా ఆఫర్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Tollywood: మెగాస్టార్ చిరణ్జీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న అప్-కమింగ్ యాక్షన్ డ్రామా ‘Mega158’. 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని పొల్లాచి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా క్యాస్టింగ్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

హనీ రోజ్ అవుట్.. ‘కూలీ’ ఫేమ్ రచితా రామ్ ఇన్!

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదట మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్‌ను ఎంపిక చేసింది. అయితే ఆమె ముందుగా ఒప్పుకున్న ఇతర సినిమాల డేట్స్, షెడ్యూల్స్ ఈ ప్రాజెక్ట్‌తో క్లాష్ అవ్వడం వల్ల హనీ రోజ్ ఈ మెగా ఆఫర్ నుండి తప్పుకున్నట్లు సమాచారం.

దాంతో ఆమె స్థానంలో కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్ ను ఫైనల్ చేశారు డైరెక్టర్ బాబీ. ఇటీవల రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌తో సౌత్ ఇండియా అంతటా పాపులర్ అయిన రచితా రామ్.. త్వరలోనే పొల్లాచిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు.

తండ్రీకూతుళ్లుగా చిరు - అనస్వర.. సంక్రాంతి 2027 టార్గెట్!

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తెగా ‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ అనస్వర రాజన్ నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే సీనియర్ నటి ప్రియమణి, గ్లామరస్ బ్యూటీ నివేతా పేతురాజ్ కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ ఈ భారీ బడ్జెట్ సినిమాతోనే టాలీవుడ్‌లోకి నేరుగా అడుగుపెడుతోంది.

గత సంక్రాంతి సీజన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ, ఈ సరికొత్త ‘Mega158’ చిత్రాన్ని కూడా సంక్రాంతి 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News