‘చికిరి చికిరి’ బీట్‌కు స్టెప్పులేసిన రామ్ చరణ్ బాడీగార్డ్

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

Update: 2026-06-07 10:24 GMT

‘చికిరి చికిరి’ బీట్‌కు స్టెప్పులేసిన రామ్ చరణ్ బాడీగార్డ్

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు, విమర్శకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ సమయం నుండి చరణ్ కంటే ఎక్కువగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఆయనే చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కేవిన్ కుంట. ప్రమోషన్స్ సమయంలో చరణ్ వైపు దూసుకొచ్చిన ఒక అభిమానిని ఒంటిచేత్తో పక్కకు నెట్టేసిన వీడియోతో కేవిన్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చికీరి చికీరి’ హల్చల్.. 4 గంటల్లోనే 21 మిలియన్ వ్యూస్!

తాజాగా తనను ఫాలో అవుతున్న అభిమానులకు కేవిన్ ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘పెద్ది’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ “చికీరి చికీరి” హుక్ స్టెప్పుకు అదిరిపోయే రేంజ్‌లో డాన్స్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక రీల్ పోస్ట్ చేశాడు. ఎప్పుడూ సూటు, బూటు వేసుకుని అత్యంత సీరియస్‌గా కనిపించే కేవిన్.. చరణ్ సాంగ్‌కు ఎంతో ఈజ్‌తో, స్మూత్ మూమెంట్స్‌తో డాన్స్ చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన కేవలం 4 గంటల్లోనే రికార్డు స్థాయిలో 21 మిలియన్ వ్యూస్ (2.1 కోట్లు) సాధించి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఎవరీ కేవిన్ కుంట? బాడీగార్డ్ వెనుక ఉన్న ఇంటర్నేషనల్ బ్యాక్‌గ్రౌండ్!

చరణ్ బాడీగార్డ్‌గా టాలీవుడ్‌లో ఫేమస్ అయిన కేవిన్ కుంట కేవలం సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు. ఆయన ఒక అంతర్జాతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ఆయన అసలు పేరు అబ్దూ కాదిర్ సోవే పశ్చిమ ఆఫ్రికాలోని ‘ది గాంబియా’ దేశానికి చెందిన ఈయన.. రామ్ చరణ్‌కు రక్షణగా ఉంటూ, ఇప్పుడు తన స్మూత్ డాన్స్ స్టెప్పులతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా లవర్స్‌లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ వీడియోతో కేవిన్ క్రేజ్ మరింత పెరిగిపోవడంతో, భవిష్యత్తులో ఆయన నుండి మరిన్ని ఇలాంటి ఫన్ వీడియోలు వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News