Suryakantham: సూర్యాకాంతం పేరు వినగానే భయపడి పారిపోయిన పనిమనిషి

Suryakantham: తెలుగు తెరపై 'గయ్యాళి అత్త' అంటే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు సూర్యకాంతం. ఆమె వెండితెరపై ఎంతగా మెప్పించారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది.

Update: 2026-04-13 04:12 GMT

Suryakantham: సూర్యాకాంతం పేరు వినగానే భయపడి పారిపోయిన పనిమనిషి

Suryakantham: తెలుగు తెరపై 'గయ్యాళి అత్త' అంటే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు సూర్యకాంతం. ఆమె వెండితెరపై ఎంతగా మెప్పించారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. ఆమె పేరు వినగానే ఒక వంటమనిషి భయంతో రైల్వే స్టేషన్ నుండే పారిపోయింది! సినిమాల్లో ఆమె నటన ఎంత సహజంగా ఉండేదంటే, బయట కూడా ఆమె గయ్యాళి అని జనం నమ్మేవారు. కానీ నిజానికి ఆమె వెన్నలాంటి మనసున్న మనిషి.

ఆసక్తికరమైన ఆ ఘటన ఏంటంటే?

మద్రాసులో ఉన్నప్పుడు సూర్యకాంతం గారికి ఒక వంటమనిషి అవసరమైంది. కాకినాడలో ఉన్న తన బంధువులకు ఉత్తరం రాస్తూ.. ఎవరైనా నమ్మకమైన వంటావిడ ఉంటే పంపమని కోరారు. బంధువులు ఒక అమ్మాయిని ఒప్పించి, మద్రాసు పంపేందుకు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌లో ఎవరో పరిచయస్తులు ఎదురై "ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగారు.

దానికి సూర్యకాంతం బంధువు.. "నేను ఎక్కడికీ వెళ్లడం లేదు, మా సూర్యకాంతం ఇంట్లో వంట చేయడానికి ఈ అమ్మాయిని మద్రాసు పంపిస్తున్నాను" అని చెప్పారు. ఆ మాట వినడమే ఆలస్యం.. అప్పటివరకు హుషారుగా ఉన్న ఆ వంటమనిషి ముఖం పాలిపోయింది. "వామ్మో! ఆ సూర్యకాంతం గారి ఇంట్లోనా? సినిమాల్లోనే ఆమెను భరించలేం.. ఇక ఇంట్లో వంట చేస్తే నన్ను బతకనిస్తుందా?" అంటూ తన లగేజీ పట్టుకుని అక్కడి నుంచి కాలికి బుద్ధి చెప్పింది. ఈ ఒక్క ఘటన చాలు, ప్రేక్షకుల మనసులో ఆమె ఎంతటి ముద్ర వేశారో చెప్పడానికి!

సూర్యాకాంతం జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు

1924 అక్టోబర్ 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతం, 14 మంది సంతానంలో చిన్నది. చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకుని, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1946లో ‘నారద నారది’ సినిమాతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, 1950లో ‘సంసారం’ చిత్రంతో మలుపుతిరిగింది. ఆ సినిమాలో చేసిన గయ్యాళి పాత్రతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

1924 అక్టోబర్ 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతం, 14 మంది సంతానంలో చిన్నది. చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకుని, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1946లో ‘నారద నారది’ సినిమాతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, 1950లో ‘సంసారం’ చిత్రంతో మలుపుతిరిగింది. ఆ సినిమాలో చేసిన గయ్యాళి పాత్రతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 1994లో విడుదలైన ఎస్పీ పరశురామ్‌ ఆమె చివరి చిత్రం. ఈ చిత్రం పూర్తి చేసిన తరువాత అదే ఏడాది డిసెంబర్‌ 18న ఆమె కన్నుమూశారు.

తెరపై విలన్ అత్తగా కనిపించినా, నిజ జీవితంలో ఆమె ఎందరో పేదలకు సహాయం చేసిన దాత. ఆమె గయ్యాళితనం కేవలం పాత్రలకే పరిమితం. కానీ ఆ వంటమనిషి లాంటి సామాన్యులు మాత్రం ఇప్పటికీ ఆమెను ఆ పాత్రల ద్వారానే గుర్తుంచుకుంటారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం సూర్యకాంతం గారి పేరు అజరామరం. దట్‌ఈజ్‌ సూర్యాకాంతం.

Tags:    

Similar News