Peddi Movie: ‘పెద్ది’కి రూ.125 కోట్ల భారీ నష్టం.. తేల్చేసిన సెలబ్రిటీ

Peddi Movie: బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల వైపు దూసుకెళ్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’పై వివాదాస్పద క్రిటిక్ కేఆర్కే షాకింగ్ కామెంట్లు.

Update: 2026-06-18 03:55 GMT

Peddi Movie: ‘పెద్ది’కి రూ.125 కోట్ల భారీ నష్టం.. తేల్చేసిన సెలబ్రిటీ

Krk Tweets: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపుతోంది. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రెండు వారాల థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹393 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ₹400 కోట్ల మైలురాయిని అందుకోవడానికి సినిమా రెడీగా ఉంది.

సరిగ్గా ఇలాంటి టైంలోనే.. టాలీవుడ్ సినిమాలపై, సౌత్ హీరోలపై ఎప్పుడూ బురద చల్లడమే పనిగా పెట్టుకునే బాలీవుడ్ వివాదాస్పద సమీక్షకుడు కమల్ ఆర్ ఖాన్ ‘పెద్ది’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా ఫ్లాప్ అయిందంటూ, నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయంటూ ఎక్స్‌ వేదికగా విషం కక్కాడు. ‘పెద్ది’ సినిమా నిర్మాత రూ.125 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తుంటే, తనను తాను స్టార్‌గా చెప్పుకునే రామ్ చరణ్ మాత్రం సినిమా సక్సెస్ అయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మీడియా కూడా దీనిని ‘హిట్’ సినిమాగా పేర్కొంటోంది. మీడియా ఎంతటి సిగ్గులేని స్థితికి దిగజారిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. హిందీ సర్క్యూట్‌లో ఈ సినిమా సాధించిన మొత్తం వసూళ్లు కేవలం రూ. 15 కోట్లు మాత్రమే అని కేఆర్కే రాసుకొచ్చాడు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి దూసుకెళ్తోంది. నార్త్, ఓవర్సీస్ మార్కెట్లలో వసూళ్లు కొద్దిగా నెమ్మదించినా.. హిందీలో ₹15 కోట్లు మాత్రమే వచ్చాయనడానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. కేవలం రామ్ చరణ్‌ను టార్గెట్ చేస్తూనే కేఆర్కే ఈ పోస్ట్ పెట్టాడని స్పష్టమవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కేఆర్కేపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

కేఆర్కే అక్కసు ఒక్క ‘పెద్ది’తోనే ఆగలేదు. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’, అలాగే గత చిత్రం ‘రాజా సాబ్’లపైనా అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రభాస్‌తో రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఫౌజీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఏ సంస్థ కూడా దీని డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ట్రైలర్ విడుదలయ్యాక డిజిటల్ హక్కుల కోసం కనీసం రూ.100 కోట్ల ఆఫర్ వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. అంటే విడుదల ముందే రూ.400 కోట్ల నష్టం. ఇక ప్రభాస్ గత చిత్రం ‘రాజా సాబ్’ విషయంలో నిర్మాతలు ఇప్పటికే రూ.425 కోట్ల నష్టాన్ని చవిచూశారు అంటూ ట్వీట్ చేశాడు.ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన ప్రభాస్ సినిమాలపై, క్రేజీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అతనికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

ఇక టాలీవుడ్ జేమ్స్ కామెరూన్ ఎస్.ఎస్ రాజమౌళిని కూడా ఈ వివాదాస్పద విమర్శకుడు వదల్లేదు. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ బిజినెస్ క్లోజ్ అవ్వడం లేదంటూ కథలు అల్లాడు. దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు. డిజిటల్ హక్కుల ద్వారా ఆయన రూ.600 కోట్లు వస్తాయని ఆశించారు, కానీ నెట్‌ఫ్లిక్స్ కేవలం రూ.110 కోట్లు మాత్రమే ఆఫర్ చేసింది. ఏ సినిమాకైనా రూ.150 కోట్లకు మించి చెల్లించకూడదని డిజిటల్ సంస్థలన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. దాంతో ఇప్పుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమలో డొనాల్డ్ ట్రంప్‌లా మారిపోయారు. ఏం చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు అని పేర్కొన్నాడు.

గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా మార్కెట్, క్రేజ్ ఊహించని రేంజ్‌కు వెళ్లడంతో తట్టుకోలేకనే కేఆర్కే ఇలాంటి పిచ్చి ట్వీట్లు చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అటెన్షన్ కోసమే చరణ్, ప్రభాస్, రాజమౌళి లాంటి పెద్ద పేర్లను వాడుకుంటూ పాపులర్ అవ్వాలని చూస్తున్న కేఆర్కేకు సోషల్ మీడియాలో సౌత్ నెటిజన్లు గట్టి బుద్ధి చెబుతున్నారు.



 




 


 



Tags:    

Similar News