Peddi: ‘పెద్ది’ నుండి ‘హల్లోహల్లల్లో’ ఐటమ్ సాంగ్ అవుట్

Peddi: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

Update: 2026-06-16 11:03 GMT

Peddi: ‘పెద్ది’ నుండి ‘హల్లోహల్లల్లో’ ఐటమ్ సాంగ్ అవుట్

Peddi: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. థియేట్రికల్ రన్‌లో ఇప్పటికే వందల కోట్లు కొల్లగొడుతూ, వరల్డ్‌వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నుండి మేకర్స్ వరుసగా సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. సినిమా ఘన విజయం సాధించిన ఆనందంలో సోమవారం ‘చికిరి’ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు థియేటర్లలో మాస్ పూనకాలు తెప్పించిన ‘హల్లోహల్లల్లో’ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు.

బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం.. థియేటర్ల రన్‌కు మరింత బూస్ట్!

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రామ్‌చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి. సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో, సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలిచిన ‘హల్లోహల్లల్లో’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయడం ద్వారా కలెక్షన్ల వేగానికి మేకర్స్ మరింత బూస్ట్ ఇచ్చారు.

చరణ్‌తో కలిసి శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ ఊరమాస్ డ్యాన్స్!

ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ థియేటర్లలో ఆడియన్స్‌తో ఈలలు వేయించింది. రామ్‌చరణ్‌ గ్రేస్‌ఫుల్ మాస్ స్టెప్పులకు తోడుగా, గ్లామర్ బ్యూటీస్ శ్రుతి హాసన్‌, జాన్వీ కపూర్ తమ డ్యాన్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేశారు. ముగ్గురు టాప్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో పోటీపడి మరీ మాస్ మూవ్స్ వేయడం ఈ పాటకు మెయిన్ అసెట్‌గా నిలిచింది.

ఏఆర్‌ రెహమాన్ మాస్ మ్యాజిక్.. అనంత శ్రీరామ్ లిరిక్స్

మ్యూజిక్ లెజెండ్ ఏఆర్‌ రెహమాన్‌ అందించిన ఊపు తెచ్చే బీట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఈ ఐటమ్ సాంగ్‌కు థియేటర్లలో రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో వచ్చింది. అనంత శ్రీరామ్‌ రాసిన క్యాచీ లిరిక్స్‌కు, సింగర్ రక్షిత సురేశ్‌ తన హై-ఎనర్జీ వాయిస్‌తో ప్రాణం పోశారు. బుచ్చిబాబు సన స్క్రీన్‌ప్లే, మేకింగ్ వాల్యూస్ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి.

Full View


Tags:    

Similar News