Medak: మెదక్ కలెక్టరేట్ ముట్టడి లారీలు గన్ని బ్యాగుల కోసం రైతుల నిరసన

Medak: అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లారీలు, గోనె సంచులను పంపాలని సర్దన గ్రామ రైతుల నిరసన.

Update: 2026-05-27 09:35 GMT

Medak: మెదక్ కలెక్టరేట్ ముట్టడి లారీలు గన్ని బ్యాగుల కోసం రైతుల నిరసన

మెదక్: తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి లారీలను, గోనె సంచులను వెంటనే పంపించాలని బుధవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిరసన ,తెలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సర్దన గ్రామంలో ఐకెపి సెంటర్ నిర్వాహకులు లారీలను తెప్పించడం లో విఫలమయ్యారని ఆరోపించారు.

బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో దాన్యంపై ప్లాస్టిక్ కవర్లు కప్పిన అవి గాలికి కొట్టుకుపోవడంతో దాన్యం తడిసి ముద్దయిందని వాటిని మళ్లీ ఆరబెట్టి అమ్మాలంటే కష్టమైన పని గా ఉంటుందని అన్నారు. అధికారులు సకాలంలో స్పందించి లారీలను గన్ని బ్యాగులను పంపిస్తే ఈరోజు వర్షానికి దాన్యం తడిసేది కాదని తెలిపారు. అధికారుల దగ్గరికి వెళ్లిన సర్జన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి ఎవరూ పట్టించుకుంటలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ నాగేష్ రైతుల వద్దకు వచ్చి వారిని సముదాయించి జిల్లాలో కూలీల కొరత ఉన్నందున కొంత సమయం పడుతుందని లారీల కొరత లేకుండా చూస్తామని జిల్లాలో, గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు కొన్ని మూసివేసామని వాటి స్థానంలో ఉన్న లారీలను మీ గ్రామాలకు తొందర్లోనే వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి మీ ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా లో గ్రామానికి చెందిన 100 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News