Medak: ఈద్గాల వద్ద పోలీసు పహారా.. పటిష్ట భద్రతను పరిశీలించిన ఎస్పీ

Medak: బక్రీద్ పండుగ సందర్భంగా మెదక్‌లో పటిష్ట భద్రత. నవాబ్‌పేట్, గాంధీనగర్ ఈద్గాలను పరిశీలించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.

Update: 2026-05-28 08:11 GMT

Medak: ఈద్గాల వద్ద పోలీసు పహారా.. పటిష్ట భద్రతను పరిశీలించిన ఎస్పీ

మెదక్: బక్రీద్ పండుగ సందర్భంగా మెదక్ పట్టణంలోని నవాబ్‌పేట్, గాంధీనగర్ ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పరిశీలించారు. పండుగ ప్రశాంత వాతావరణంలో జరగాలని పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.నవాబ్‌పేట్ ఈద్గా వద్ద అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. ఈద్గాల పరిసర ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్, మొబైల్ పెట్రోలింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. పండుగ సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీసు సిబ్బందికి లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజలు నిర్భయంగా పండుగ జరుపుకునేలా పోలీసు శాఖ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోందని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ వెంట డియస్పి ప్రసన్న కుమార్, సీఐ లు మహేష్, సందీప్ రెడ్డి, ఎసై లు మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ సిబ్బంది ఉన్నారు.

Tags:    

Similar News