Narsapur: ప్రతి శుక్రవారం అందరికీ అందుబాటులో అంబలి పంపిణీ..

Narsapur: నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో పదేళ్లుగా ప్రతి శుక్రవారం అంబలి పంపిణీ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకుడు దుర్గాప్ప గారి నాగరాజుగౌడ్.

Update: 2026-05-29 10:58 GMT

Narsapur: ప్రతి శుక్రవారం అందరికీ అందుబాటులో అంబలి పంపిణీ..

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు దుర్గాప్ప గారి నాగరాజుగౌడ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో అంబలి పంపిణీ దాదాపు 2500 మందికి అంబలి తాగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. తమ తల్లిదండ్రులే తనకి ప్రత్యక్ష దైవంగా కనిపించని దేవుడి కంటే కనిపించే తల్లిదండ్రులు ప్రత్యక్షదేవులుగా అని భావిస్తూ నర్సాపూర్ పట్టణంలో వేసవి కాలంలో ప్రతి శుక్రవారం అంబలి పంపిణీ చేస్తున్నారు.

గత 10 సంవత్సరాలకు పైగా అంబలి పంపిణీ చేస్తున్నారు అంతకుముందు చలివేంద్రం ఏర్పాటు చేసి వేసవి కాలంలో మంచినీరు అందించారు.అది కూడా కట్టెల పొయ్యి మీద అంబలి తయారు చేస్తూ నర్సాపూర్ పట్టణవాసులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్లు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి కూడా అంబలి పంపిణీ చేస్తున్నారు. అంబలి తన కుటుంబ సభ్యుల తో కలిసి అంబలి తయారు చేస్తామని నాగరాజు గౌడ్ తెలిపారు.

వేసవికాలంలో ఎండల తీవ్రత బాగా ఉండటంతో చల్లదనం కోసం తన తల్లిదండ్రుల పేరు మీద నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో అక్కడికి వచ్చే వారికి అంబలి పంపిణీ చేస్తూ సేవ చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం నర్సాపూర్ మేజర్ గ్రామపంచాయతీలో వార్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు తన వార్డులో నీటి కష్టాలు చూసిన నాగరాజు గౌడ్ తన వాడు ప్రజలకు ట్యాంకర్ ద్వారా నీళ్లు అందించాడు.

తనకు పదవులు శాశ్వతం కాదని పదవులు లేకున్నా ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని పేర్కొన్నారు తల్లితండ్రుల పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నందున నర్సాపూర్ పట్టణవాసులతో పాటు చుట్టూ పక్కల ప్రజలు రాజకీయ నాయకులు నాగరాజుగౌడ్ ని అభినందిస్తున్నారు.

Tags:    

Similar News