Parenting Tips: మీ పిల్ల‌ల విష‌యంలో ఈ త‌ప్పులు చేస్తున్నారా.?

Parenting Tips: పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమపడుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు మంచి స్కూల్‌, ఖరీదైన కోచింగ్‌ ఉంటేనే పిల్లలు తెలివిగా పెరుగుతారని భావిస్తారు. కానీ నిజానికి పిల్లల మంచి పెంపకానికి మ‌రికొన్ని అంశాలు కూడా దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.?

Update: 2026-04-02 09:33 GMT

Parenting Tips: మీ పిల్ల‌ల విష‌యంలో ఈ త‌ప్పులు చేస్తున్నారా.? 

Parenting Tips: పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమపడుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు మంచి స్కూల్‌, ఖరీదైన కోచింగ్‌ ఉంటేనే పిల్లలు తెలివిగా పెరుగుతారని భావిస్తారు. కానీ నిజానికి పిల్లల మంచి పెంపకానికి మ‌రికొన్ని అంశాలు కూడా దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.?

ప్రతిరోజూ పిల్లలతో మాట్లాడే అలవాటు పెంచండి

ఈరోజుల్లో అందరూ పనుల్లో బిజీగా ఉండటం వల్ల పిల్లలతో కూర్చొని మాట్లాడేందుకు సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ పిల్లలతో రోజూ 10–15 నిమిషాలు మాట్లాడటం వారి మానసిక వికాసానికి చాలా ఉపయోగపడుతుంది. వారి రోజు ఎలా గడిచింది? స్కూల్‌లో ఏమైంది? వారి స్నేహితులు ఎలా ఉన్నారు? వంటి విషయాలు అడిగి తెలుసుకోండి. ఇలా మాట్లాడితే పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతారు. దీంతో

పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది, మాట్లాడే నైపుణ్యం మెరుగుపడుతుంది.

పిల్లల ప్రశ్నలకు ఓపిక‌తో సమాధానం చెప్పండి

పిల్లలు చిన్నప్పటి నుంచే చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు వారి ప్రశ్నలు పెద్దవారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ వారి ప్రశ్నలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. పిల్లలు ఏదైనా అడిగితే శ్రద్ధగా విని, వారికి అర్థమయ్యేలా వివరించండి. మీకు సమాధానం తెలియకపోతే పిల్ల‌ల‌తో క‌లిసి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది.

స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయండి

మొబైల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్లెట్లు ఇప్పుడు పిల్లల జీవితంలో భాగమైపోయాయి. కానీ ఎక్కువగా స్క్రీన్ ముందు గడపడం పిల్లల ఆరోగ్యం, మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే తల్లిదండ్రులు స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయాలి. దానికి బదులుగా పిల్లలను పుస్తకాలు చదవడం, డ్రాయింగ్ చేయడం, అవుట్‌డోర్ గేమ్స్ ఆడడం, పజిల్స్ పరిష్కరించడం వంటి కార్యకలాపాలకు ప్రోత్సహించాలి. దీని వల్ల పిల్లల్లో ఫోకస్, ఊహాశక్తి మరింత బలపడతాయి.

పిల్లల విజయాలను ప్రశంసించండి

ప్రతి పిల్లవాడూ తన పనిని తల్లిదండ్రులు గుర్తించాలనుకుంటాడు. చిన్న విజయాలైనా పిల్లలను ప్రశంసించడం చాలా ముఖ్యం. పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే హృదయపూర్వకంగా అభినందించండి. తప్పు జరిగితే గట్టిగా మందలించకుండా ప్రేమగా వివరించండి. ఇలా చేస్తే పిల్లలు తప్పుల నుంచి నేర్చుకోవడం అలవాటు చేసుకుంటారు, భయపడకుండా ప్రయత్నిస్తారు, తమపై నమ్మకం పెంచుకుంటారు.

చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వండి

పిల్లలు బాధ్యత నేర్చుకోవాలంటే చిన్న వయస్సు నుంచే కొన్ని పనులు అప్పగించడం అవసరం. ఉదాహరణకు

తమ స్కూల్ బ్యాగ్‌ను తాము సిద్ధం చేసుకోవడం, పుస్తకాలను సరిగ్గా పెట్టడం, తమ గదిని శుభ్రంగా ఉంచడం

వంటి పనులు చేయించడం మంచిది.

Tags:    

Similar News