Markapuram: మూడో రోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు

Markapuram: మార్కాపురంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంఘీభావం తెలిపారు.

Update: 2026-08-08 09:00 GMT

Markapuram: మూడో రోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు

మార్కాపురం జిల్లా

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష

మూడో రోజు దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

మార్కాపురం జిల్లా కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి.

మూడో రోజు దీక్ష కార్యక్రమంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ అన్నా వెంకట రాంబాబు పాల్గొని విద్యార్థులు, యువతకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువ నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు.

డీఎస్సీ నియామకాలతో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని కోరారు.

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు.

Tags:    

Similar News