Pathikonda: సూర్యోదయ గోడ చిత్రంతో వినూత్న బోధన – ఉపాధ్యాయురాలు మారుతి

Pathikonda: కర్నూలు జిల్లా పత్తికొండలో సూర్యోదయ గోడ చిత్రంతో వినూత్నంగా బోధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎం. మారుతి. అభినందనీయమైన ప్రయోగం.

Update: 2026-08-07 10:05 GMT

Pathikonda: సూర్యోదయ గోడ చిత్రంతో వినూత్న బోధన – ఉపాధ్యాయురాలు మారుతి

పత్తికొండ: సూర్యోదయ గోడ చిత్రంతో వినూత్న బోధనవాయిస్ :సాధారణ తరగతి గదిని సజీవమైన భాషా ప్రయోగశాలగా మార్చిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు.. వినూత్న బోధనా విధానంతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రాజీవ్ నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఎం. మారుతి. సూర్యోదయ గోడ చిత్రం పేరుతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.సూర్యుడి చిత్రాన్ని ఆధారంగా తీసుకుని.. సూర్యుడు + ఉదయం = సూర్యోదయం, సూర్యుడు + రోజు = ఆదివారం వంటి సంయుక్త పదాలను పిల్లలే గుర్తించి రూపొందించేలా బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు పదాలను కంఠస్థం చేయకుండా.. అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ నేర్చుకుంటున్నారు.

చిత్రాల ద్వారా బోధించడం వల్ల ఆంగ్ల పదజాలంపై పిల్లల్లో ఆసక్తి పెరగడమే కాకుండా. నేర్చుకునే ప్రక్రియ మరింత సులభంగా, ఆనందదాయకంగా మారిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లలు ఒక పదాన్ని కేవలం కంఠస్థం చేయడానికి బదులుగా.

దానిని తామే కనుగొన్నప్పుడు నేర్చుకోవడం మరింత అర్థవంతంగా మారుతుంది" అని ఉపాధ్యాయురాలు ఎం. మారుతి తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు సృజనాత్మక బోధనకు ఈ వినూత్న ప్రయత్నం ఆదర్శంగా నిలుస్తోంది.

Tags:    

Similar News