Kurnool: ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్!

Kurnool: గూడూరు మండలం గుడిపాడులో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన ముఖద్వారాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు.

Update: 2026-08-08 08:53 GMT

Kurnool: ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్!

kurnool: కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి ఆశీస్సులు పొందారు.ఎంతోకాలంగా భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడంతో ఆలయానికి నూతన శోభ సంతరించుకుంది.

ఆలయ పునఃప్రారంభ కార్యక్రమంలో స్థలదాత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో నిర్వహించారు.కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

గ్రామ ప్రజలు, భక్తుల సమక్షంలో ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరగడంతో గుడిపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News