kurnool: కోడుమూరు 12వ జాతీయ చేనేత దినోత్సవం: పాల్గొన్న వైఎస్సార్‌సీపీ!
kurnool: కోడూరులో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మాజీ ఎంపీ బుట్టా రేణుక, అధిమూలపు సతీష్, బుట్టా ప్రతుల్ పాల్గొన్నారు.
kurnool: కోడుమూరు 12వ జాతీయ చేనేత దినోత్సవం: పాల్గొన్న వైఎస్సార్‌సీపీ!
kurnool: 12వజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కోడూమూరు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారు, కోడూమూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ అధిమూలపు సతీష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బుట్టా ప్రతుల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుట్టా రేణుక గారు మాట్లాడుతూ, చేనేత అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. చేనేత కార్మికుల శ్రమను గౌరవించడం, చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.డాక్టర్ అధిమూలపు సతీష్ మాట్లాడుతూ, చేనేత రంగం వేలాది కుటుంబాలకు జీవనాధారమని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాలను ప్రజలు ఆదరించాలని కోరారు.
బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ, చేనేత కార్మికుల కష్టం దేశ ఆర్థిక వ్యవస్థకు, సాంస్కృతిక వారసత్వానికి గొప్ప బలమని అన్నారు. యువత చేనేత వస్త్రాల వినియోగానికి ముందుకు రావాలని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా చేనేత కుటుంబాలకు భరోసా కల్పించవచ్చని పేర్కొన్నారు.
చేనేత రంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.అనంతరం నాయకులు చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి, 12వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.