Ardhaveedu: బాధిత కుటుంబానికి అండగా ప్రధాని జీవన్ జ్యోతి బీమా!

Ardhaveedu: అర్ధవీడులో గుండెపోటుతో మృతి చెందిన రామిరెడ్డి కుటుంబానికి PMJJBY కింద రూ.2 లక్షల బీమా సహాయం అందజేసిన కంభం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం.

Update: 2026-09-01 01:51 GMT

Ardhaveedu: బాధిత కుటుంబానికి అండగా ప్రధాని జీవన్ జ్యోతి బీమా!

Ardhaveedu: అర్ధవీడు ప్రమాదంలో భర్తను కోల్పోయిన కుటుంబానికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండగా నిలిచింది. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన వల్లెల కల్పన భర్త వల్లెల రామిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.

ఆయన బ్యాంకు ఖాతాను పరిశీలించిన అధికారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా ఉన్నట్లు గుర్తించారు. అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి నామినీగా ఉన్న కల్పన బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల బీమా మొత్తాన్ని జమ చేశారు.

కంభం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కందులపురం కెనరా బ్యాంకు మేనేజర్ డి. రామకోటేశ్వరరెడ్డి, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్ బీమా చెక్కును పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బ్యాంకింగ్, సామాజిక భద్రతా పథకాలు, డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ప్రైవేటు ఆర్థిక సంస్థల మోసాలు, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్, క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో సంవత్సరానికి రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల బీమా ప్రయోజనం పొందవచ్చని వివరించారు. రూపే ఏటీఎం కార్డు వినియోగదారులకు కూడా ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు.

బీమా ద్వారా అందిన రూ.2 లక్షలను తన పిల్లల చదువుతో పాటు కుటుంబ అభివృద్ధికి వినియోగించుకుంటానని కల్పన తెలిపారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించి బీమా ప్రయోజనం పొందేలా చేసిన కంభం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి. అశోక్ కుమార్, కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News