Markapur: కలనూతలలో నీటిలో చిక్కుకున్న ముగ్గురు యువకులు రక్షణ!
Markapur: పెద్దారవీడు మండలం కలనూతలలో వెలిగొండ ప్రాజెక్ట్ నీటిలో చిక్కుకున్న ముగ్గురు యువకులను రెస్క్యూ సిబ్బంది రాత్రంతా శ్రమించి క్షేమంగా కాపాడారు.
Markapur: కలనూతలలో నీటిలో చిక్కుకున్న ముగ్గురు యువకులు రక్షణ!
Markapur: పెద్దారవీడు మండలం కలనూతల వద్ద శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నీటిలో ముగ్గురు యువకులు చిక్కుకున్న ఘటన తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ప్రమాదవశాత్తు కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో.. ప్రాణభయంతో ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టుపైకి ఎక్కి తమను కాపాడాలంటూ వేడుకున్నారు.
సమాచారం అందుకున్న కలెక్టర్ విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. తీవ్ర రిస్క్ మధ్య రెస్క్యూ సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌తో చివరకు ముగ్గురు యువకులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రాత్రంతా అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలపై మార్కాపురం ప్రజలు ప్రశంసలు కురిపించారు.