Nandyal: దద్దనాల ప్రాజెక్టుకు ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల!
Nandyal: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశాలతో ఎస్సార్‌బీసీ నుంచి దద్దనాల ప్రాజెక్టుకు ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు.
Nandyal: దద్దనాల ప్రాజెక్టుకు ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల!
నంద్యాల: ప్రభుత్వాన్ని ఒప్పించి నీటిని విడుదల చేయించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన స్థానిక నేతలు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బనగానపల్లె పట్టణంలోని ఎస్సార్ బీసీ కెనాల్ నుండి దద్దనాల( జుర్రేరు) ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడం జరిగింది.
మంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఎస్ఆర్బిసి నుండి ఎత్తిపోతల పథకం మోటార్లను ఆన్ చేసి దద్దనాల ప్రాజెక్టులోనికి నీటిని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొండు నడిపి భూషన్న,యాగంటి దేవస్థానం చైర్మన్ బండి మౌలీశ్వర రెడ్డి, బత్తుల నారాయణ రెడ్డి, సంగు సంకేశ్వర రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్వయంగా మాట్లాడి ఎస్ఆర్బిసి కి కాల్వకు నీటిని విడుదల చేయించారని ఆయా నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్ఆర్బిసికు నీరు రావడంతో దద్దనాల ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పడమటిపల్లెల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న క్రమంలో దద్దనాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తే 2000 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు త్రాగునీటి సమస్య తీరుతుందన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎస్ఆర్బిసి కాలువకు నీటిని విడుదల చేయించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి నియోజవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడి భాస్కర్ రెడ్డి, గోపినాథ్, జయ నాయక్, కాంతు రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.