Kurnool: కర్నూలులో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Kurnool: కర్నూలులో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. బైక్ ర్యాలీతో పాటు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు.

Update: 2026-08-31 12:39 GMT

Kurnool: కర్నూలులో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

కర్నూలు: 02-09-2026 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నామని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు బిర్లా కాంపౌండ్ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన జనసేన నాయకుల సమావేశంలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2వ తేదీ ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం మెగాసిరి ఫంక్షన్ హాల్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని అదే రోజు ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగాన్ని ప్రారంభించనున్నారని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు నంద్యాల చెక్పోస్ట్ సమీపాన మెగాసిరి ఫంక్షన్ హాల్ లో స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News