Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక

Markapur: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.

Update: 2026-08-09 06:30 GMT

Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక

ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం జిల్లా: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను స్పష్టంగా అర్జీ రూపంలో రాసుకొని సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రజలు 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీలను నమోదు చేసుకోవడంతో పాటు, వాటి పరిష్కార స్థితిని కూడా తెలుసుకోవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అర్జీలు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

ప్రజా పరిష్కార వేదికపై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా PGRS వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయ సునీత కోరారు.

Tags:    

Similar News