Markapur: ముద్దసానమ్మ ఆలయ అభివృద్ధికి భక్తుల సహకారం కోరిన ఆలయ కమిటీ!
Markapur: ఆషాఢ మాసం 4వ ఆదివారం సందర్భంగా మార్కాపురంలోని ముద్దసానమ్మ అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Markapur: ముద్దసానమ్మ ఆలయ అభివృద్ధికి భక్తుల సహకారం కోరిన ఆలయ కమిటీ!
Markapur: మార్కాపురంలో ఆషాఢ మాసం నాలుగవ ఆదివారం సందర్భంగా ముద్దసానమ్మ అమ్మవారిని శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది.
పవిత్రమైన ఈ నిర్మాణ కార్యక్రమానికి భక్తులు తమవంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. అమ్మవారి సేవలో భక్తుల సహకారం, ఆలయ అభివృద్ధికి వారి తోడ్పాటు ఎంతో అవసరమని తెలిపారు.