Mahanandi: మహానంది పిఎస్ లో ఎస్పీ సునీల్ షొరాణ్ ఆకస్మిక తనిఖీ
Mahanandi: మహానంది పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్. బాధితులకు త్వరగా న్యాయం చేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని ఆదేశం.
Mahanandi: మహానంది పిఎస్ లో ఎస్పీ సునీల్ షొరాణ్ ఆకస్మిక తనిఖీ
మహానంది: మహానంది పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు.
నంద్యాల జిల్లా మహానంది పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ, వివిధ సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన బాధితులతో స్వయంగా మాట్లాడారు.
వారి సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ… పోలీస్ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది, ఫిర్యాదులపై స్పందన ఎలా ఉందన్న అంశాలపై ఆరా తీశారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ… స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి వెంటనే స్పందించి, చట్టపరిధిలో న్యాయం అందేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని సూచించారు.
బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, ప్రతి కేసును సున్నితంగా పరిశీలించి తగిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో నంద్యాల సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ కుమారి ఎం. జావళి ఐపీఎస్, తాలుకా రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.