Kurnool: కర్నూలు ప్రిన్సిపాల్ డా. నాగస్వామి నాయక్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లయన్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్‌కు అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం–2026 ఘనంగా ప్రదానం చేశారు.
Kurnool: కర్నూలు ప్రిన్సిపాల్ డా. నాగస్వామి నాయక్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల, కర్నూలు ప్రిన్సిపాల్ లయన్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ విద్యా మరియు సామాజిక సేవా రంగాలలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అలిశెట్టి ప్రభాకర్ మెమోరియల్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక "అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం–2026" ఘనంగా ప్రదానం చేయబడింది.
హైదరాబాద్‌లోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం, నాంపల్లిలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని డా. నాగస్వామి నాయక్ గారిని సన్మానించి పురస్కారాన్ని అందజేశారు.
డా. నాగస్వామి నాయక్ గారు విద్యార్థుల విద్యాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్య కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన, యోగా, మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, ఓటరు అవగాహన, పర్యావరణ పరిరక్షణ తదితర అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా కూడా విశేష గుర్తింపు పొందారు.
ఈ సందర్భంగా డా. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులందరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యా మరియు సామాజిక సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు డా. నాగస్వామి నాయక్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.